హైదరాబాద్ అనేది ఒక మినీ ప్రపంచం. దునియా అంతటి నుంచి ఇక్కడ ప్రజలు నివసిస్తూ ఉంటారు. కొందరు నగరాన్ని తమ చిరునామాగా ఎంచుకుంటారు. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెడుతుంటారు. కొందరు సొంతింటిని కట్టుకుంటారు. మరికొందరూ కొనుక్కుంటారు. ఇలా రక రకాలుగా రియల్ ఎస్టేట్ నిత్యం కొనసాగుతుంటుంది. ఇందులో 60 శాతం వరకు మోసాలు జరుగుతాయి. మోసపోయిన వారి బాధ వర్ణానాతీతం. అందుకే బాధితుల పక్షాన, సొంతింటి కళను నిజం చేసుకోవాలనే సామాన్యుల పక్షాన నిలిచేందుకు దక్కన్ న్యూస్ మీ ముందుకు వస్తుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ సమాచారంతో రియల్ బూమ్ ను చూపిస్తూనే.. రియల్ మోసాలపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. త్వరలో మీ ముందుకు మరింత వేగంగా దూసుకురాబోతున్న దక్కన్ న్యూస్ ను ఆదరిస్తారని ఆశిస్తున్నాం..
SATYA
ఒక సినిమాను గురించి చాలారోజుల పాటు అంతా మాట్లాడుకున్నారు. ఆ సినిమా పేరే ’12th ఫెయిల్’. ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. విదు వినోద్ చోప్రా దర్శక నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా, 2023 అక్టోబర్ 27వ తేదీన థియేటర్లలో విడుదలైంది. డిసెంబర్ 29 నుంచి స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఇన్ని రోజులుగా హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా, నిన్నటి నుంచి తెలుగుతో పాటు, ఇతర భాషల్లోను అందుబాటులోకి వచ్చింది.
ఈ కథ 1997లో మొదలవుతుంది. మనోజ్ కుమార్ ( విక్రాంత్ మాసే) చంబల్ ప్రాంతానికి చెందిన యువకుడు. అక్కడి పరిస్థితుల కారణంగా ఆ ప్రాంతం చాలా వెనకబడిపోతోంది. తల్లిదండ్రులు .. ఒక సోదరుడు .. సోదరి .. నాయనమ్మ .. ఇది అతని కుటుంబం. మనోజ్ కుమార్ తండ్రి రామ్ వీర్ (హరీశ్ ఖన్నా) చేస్తున్న చిన్నపాటి ఉద్యోగమే ఆ కుటుంబానికి ఆధారం. అయితే ఆ ప్రాంతానికి చెందిన ఎమ్ ఎల్ ఎ .. అతని మద్దతుదారుడి అవినీతి కారణంగా, రామ్ వీర్ సస్పెండ్ అవుతాడు. దాంతో ఆ కుటుంబం గడవడం మరింత కష్టమవుతుంది.
ఢిల్లీ: డిమాండ్లు నెరవేర్చాలని రైతులు మరోసారి ఛలో ఢిల్లీ మార్చ్‌కు పిలుపునిచ్చారు. కొద్ది రోజుల క్రితం చేపట్టిన ఢిల్లీ మార్చ్ ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది..
రైతులతో పోలీసుల మధ్య తోపులాటలో ఇరు వర్గాలు గాయపడిన సంగతి తెలిసిందే. దాంతో కొద్ది రోజులు ఆందోళనకు విరామం ఇచ్చారు.
తిరిగి బుధవారం (ఈ రోజు) ఢిల్లీ ముట్టడిస్తామని రైతు సంఘాలు స్పష్టం చేశాయి. బస్సు, రైళ్ల ద్వారా ఢిల్లీకి రైతులు బయల్దేరారు.
రైతు నేతల ఢిల్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు..
పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర, రైతులు, రైతు కూలీలకు పెన్షన్, రైతు రుణ మాఫీ, కరెంట్ బిల్లుల టారిఫ్ పెంపుదల నిలిపివేత తదితర డిమాండ్లతో రైతులు కదం తొక్కారు.
కిసాన్ మజ్దూర్ మోర్చా, సంయుక్త కిసాన్ మోర్చా నేతృత్వంలో రైతుల ఆందోళన కొనసాగుతోంది. తమ డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు రైతు సంఘాలు ప్రయత్నిస్తున్నాయి.
ఈ నెల 10వ తేదీన దేశ వ్యాప్తంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రైల్ రోకో చేపడతామని రైతు నేతలు ప్రకటించారు. 4 గంటల రైల్ రోకో చేపట్టి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెబుతున్నారు.
రైతు నేతల పిలుపుతో టిక్రి, సింఘు, ఘజిపూర్ సరిహద్దుల్లో పోలీసులు భద్రతను పెంచారు. బస్టాండ్, రైల్వే స్టేషన్, మెట్రో స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు..
LRS పథకాన్ని ఉచితంగా చేయాలని డిమాండ్ చేస్తూ, బీఆర్ఎస్ నిరసనలు.
గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిలబెట్టు కోవాలంటూ డిమాండ్.
చార్జీలు లేకుండా ఉచితంగా LRS చేయాలని గులాబీ పార్టీ డిమాండ్.
రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు
అన్ని నియోజకవర్గ జిల్లా కేంద్రాల్లో ఇవాళ ధర్నా కార్యక్రమాలు
హైదరాబాద్‌లో జీహెచ్ఎమ్సీ, హెచ్ఎమ్డీఏ కార్యాలయాల వద్ద బీఆర్ఎస్ నేతలు నిరసన కార్యక్రమాలు.
ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, నేతలు నిరసనల్లో పాల్గొంటున్నారు.
రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు, ఆర్డీఓలకు వినతిపత్రాలు ఇవ్వనున్నారు
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి , సీతక్క మాట్లాడిన మాటలను గుర్తు చేస్తున్న బీఆర్ఎస్ నేతలు.
ప్రజల నుంచి 20 వేల కోట్లు వసూలు చేసేందుకు కాంగ్రెస్ సర్కారు సిద్ధమైందని గులాభి నేటల ఆరోపణ.
గతంలో కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారమే 25 లక్షల కుటుంబాలకు ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాలని డిమాండ్ .
అమీర్‌పేట మైత్రివనం హెచ్ఎండిఏ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న ధర్నాలో.. పాల్గొన్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. తలసాని సాయికుమార్ యాదవ్ స్థానిక నాయకులు.
LRS ను ఫ్రీగా అమలు చేయాలని డిమాండ్
పాల్గొన్న ఎమ్మేల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, మాగంటి గోపీనాథ్
మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యే
LRS అమలు పై కాంగ్రెస్ మాట తప్పింది
LRS ఫ్రీ గా చేయాలని కాంగ్రెస్ కోర్టుకు వెళ్ళింది
LRS ఫ్రీ గా అమలు చేస్తామని మంత్రులు, ఉత్తమ్, సీతక్క, భట్టి అన్నారు.. దాన్ని అమలు చేయాలి
భారతదేశం యొక్క 1వ నీటి అడుగున మెట్రో మార్గం మరియు ₹15,400 కోట్ల ఇతర ప్రాజెక్టులను ప్రధాని ఆవిష్కరించారు
12 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు (UTలు) తన 10 రోజుల పర్యటనలో భాగంగా కోల్‌కతాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మార్చి 6, బుధవారం నాడు, ₹15,400 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులను ప్రారంభించారు మరియు శంకుస్థాపన చేశారు. ఐదు రోజుల వ్యవధిలో పశ్చిమ బెంగాల్లో ఆయన పర్యటించడం ఇది రెండోసారి
తెలంగాణ, ఒడిశాలో ₹26,400 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన చేయనున్నారు. తెలంగాణలో రోడ్డు, రైలు, పెట్రోలియం, సహజవాయువు రంగాల్లో మొత్తం ₹6,800 కోట్లతో ప్రాజెక్టులు ఆవిష్కరించనున్నారు. సంగారెడ్డిలో ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని కూడా సందర్శిస్తారు. హైదరాబాద్‌లో ₹ 350 కోట్లతో సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (CARO) కేంద్రాన్ని, మూడు జాతీయ రహదారుల ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారు. బిజూ పట్నాయక్ జయంతి సందర్భంగా చమురు మరియు గ్యాస్, రైల్వేలు, రోడ్డు, రవాణా, హైవేలు మరియు అణుశక్తికి సంబంధించిన ప్రాజెక్టులను ప్రారంభించేందుకు ప్రధాని ఒడిశాకు వెళతారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందు అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ 12 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేస్తూ మోడీ 10 రోజుల పర్యటనలో ఈ పర్యటన భాగం.