హైదరాబాద్ అనేది ఒక మినీ ప్రపంచం. దునియా అంతటి నుంచి ఇక్కడ ప్రజలు నివసిస్తూ ఉంటారు. కొందరు నగరాన్ని తమ చిరునామాగా ఎంచుకుంటారు. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెడుతుంటారు. కొందరు సొంతింటిని కట్టుకుంటారు. మరికొందరూ కొనుక్కుంటారు. ఇలా రక రకాలుగా రియల్ ఎస్టేట్ నిత్యం కొనసాగుతుంటుంది. ఇందులో 60 శాతం వరకు మోసాలు జరుగుతాయి. మోసపోయిన వారి బాధ వర్ణానాతీతం. అందుకే బాధితుల పక్షాన, సొంతింటి కళను నిజం చేసుకోవాలనే సామాన్యుల పక్షాన నిలిచేందుకు దక్కన్ న్యూస్ మీ ముందుకు వస్తుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ సమాచారంతో రియల్ బూమ్ ను చూపిస్తూనే.. రియల్ మోసాలపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. త్వరలో మీ ముందుకు మరింత వేగంగా దూసుకురాబోతున్న దక్కన్ న్యూస్ ను ఆదరిస్తారని ఆశిస్తున్నాం..
రెరా
ఒక సినిమాను గురించి చాలారోజుల పాటు అంతా మాట్లాడుకున్నారు. ఆ సినిమా పేరే ’12th ఫెయిల్’. ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. విదు వినోద్ చోప్రా దర్శక నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా, 2023 అక్టోబర్ 27వ తేదీన థియేటర్లలో విడుదలైంది. డిసెంబర్ 29 నుంచి స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఇన్ని రోజులుగా హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా, నిన్నటి నుంచి తెలుగుతో పాటు, ఇతర భాషల్లోను అందుబాటులోకి వచ్చింది.
ఈ కథ 1997లో మొదలవుతుంది. మనోజ్ కుమార్ ( విక్రాంత్ మాసే) చంబల్ ప్రాంతానికి చెందిన యువకుడు. అక్కడి పరిస్థితుల కారణంగా ఆ ప్రాంతం చాలా వెనకబడిపోతోంది. తల్లిదండ్రులు .. ఒక సోదరుడు .. సోదరి .. నాయనమ్మ .. ఇది అతని కుటుంబం. మనోజ్ కుమార్ తండ్రి రామ్ వీర్ (హరీశ్ ఖన్నా) చేస్తున్న చిన్నపాటి ఉద్యోగమే ఆ కుటుంబానికి ఆధారం. అయితే ఆ ప్రాంతానికి చెందిన ఎమ్ ఎల్ ఎ .. అతని మద్దతుదారుడి అవినీతి కారణంగా, రామ్ వీర్ సస్పెండ్ అవుతాడు. దాంతో ఆ కుటుంబం గడవడం మరింత కష్టమవుతుంది.
ఢిల్లీ: డిమాండ్లు నెరవేర్చాలని రైతులు మరోసారి ఛలో ఢిల్లీ మార్చ్‌కు పిలుపునిచ్చారు. కొద్ది రోజుల క్రితం చేపట్టిన ఢిల్లీ మార్చ్ ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది..
రైతులతో పోలీసుల మధ్య తోపులాటలో ఇరు వర్గాలు గాయపడిన సంగతి తెలిసిందే. దాంతో కొద్ది రోజులు ఆందోళనకు విరామం ఇచ్చారు.
తిరిగి బుధవారం (ఈ రోజు) ఢిల్లీ ముట్టడిస్తామని రైతు సంఘాలు స్పష్టం చేశాయి. బస్సు, రైళ్ల ద్వారా ఢిల్లీకి రైతులు బయల్దేరారు.
రైతు నేతల ఢిల్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు..
పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర, రైతులు, రైతు కూలీలకు పెన్షన్, రైతు రుణ మాఫీ, కరెంట్ బిల్లుల టారిఫ్ పెంపుదల నిలిపివేత తదితర డిమాండ్లతో రైతులు కదం తొక్కారు.
కిసాన్ మజ్దూర్ మోర్చా, సంయుక్త కిసాన్ మోర్చా నేతృత్వంలో రైతుల ఆందోళన కొనసాగుతోంది. తమ డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు రైతు సంఘాలు ప్రయత్నిస్తున్నాయి.
ఈ నెల 10వ తేదీన దేశ వ్యాప్తంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రైల్ రోకో చేపడతామని రైతు నేతలు ప్రకటించారు. 4 గంటల రైల్ రోకో చేపట్టి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెబుతున్నారు.
రైతు నేతల పిలుపుతో టిక్రి, సింఘు, ఘజిపూర్ సరిహద్దుల్లో పోలీసులు భద్రతను పెంచారు. బస్టాండ్, రైల్వే స్టేషన్, మెట్రో స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు..